ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎంపీగా గెలుపొందాలని,కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు శనివారం గండి హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు చేసి,ముడుపులు కట్టారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జీవన్ రెడ్డి ఎంపీగా గెలిస్తే మన పార్లమెంటు నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని,మూతబడ్డ షుగర్ ఫ్యాక్టరీని పునర్దిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజి రెడ్డి, ఏనుగు రామానుజన్ రెడ్డి,జంగస్వామి,జంగిటి రాజేందర్ ,ప్రతాప్ రెడ్డి ,మేడిపల్లి ఎంపీటీసీ నాగేష్, సంతోష్ రెడ్డి ,సత్తయ్య ,రేండ్ల రాజ్ కిరణ్ ,చిన్న రెడ్డి తదితరులుపాల్గొన్నారు.