Homeహైదరాబాద్leaders us tour: అమెరికా టూర్…మతలబ్ క్యా హై బాబా

leaders us tour: అమెరికా టూర్…మతలబ్ క్యా హై బాబా

తానా ఉత్సవాల పేరిట క్యూ కడుతున్న నాయకులు

రేవంత్ రెడ్డి, ఎరబెల్లి, నిరంజన్ రెడ్డి, కిషన్ రెడ్డి, సీతక్క

leaders us tour: ఈ మధ్య నేతలందరూ అమెరికాకు క్యూ కడుతున్నారు. తానా సభల పేరుతో అమెరికాకు అందరూ వెలుతున్నప్పటికీ అమెరికా కేంద్రంగా ఏదో జరుగుతున్నదని అవగతమవుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒక్కొక్కరూ విమానం ఎక్కుతుండటం చర్చనీయాంశమైంది. ముందుగా బీఆర్ ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమెరికాకు వెళ్లారు. అనంతరం టీపీసీసీ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డి తో పాటు సీతక్క అమెరికా కు వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పయనమయ్యారు. న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పర్యాటక కార్యక్రమంలో అధికారికంగా సమావేశంలో పాల్గొంటున్నారని చెప్పినప్పటికీ విదేశీ పర్యటనలే సాకుగా ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మూడు ప్రధాన పార్టీల ముఖ్యుల విదేశీ పర్యటనల వెనుక కచ్చితంగా మతలబు ఉందని అనిపిస్తున్నది. తెలంగాణలో ఉన్న ప్రవాసుల్లో చాలా మంది కొంత ఆర్థికంగా బలపడ్డవారేనని చెప్పవచ్చు. వీరినుంచి ఎన్నికల్లో ఆర్థిక సహాయం పొందడంతోపాటు అండగా నిలబడాలని కోరడానికి తానా సభలతోపాటు ఇతర కార్యక్రమాలను వేదికగా ఉపయోగించుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రవాసులు ఏ పార్టీకీ సపోర్ట్ చేస్తే సదరు పార్టీకీ ఓట్ల శాతం పెరిగే అవకాశముంది. అందుకే సాధ్యమైనంత వరకు తమ పార్టీకే మద్ధతు తెలుపాలని కోరుతున్నట్లు తెలిసింది.

ఎన్నికల ఖర్చుల కోసం అవసరమయ్యే నిధుల వేటలో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. ఈ దఫా ఎన్నికల్లో కోట్లలో ఖర్చు ఉండబోతుందన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల ఖర్చును వయా అమెరికా టూ తెలంగాణ కు పంపించడానికే అన్ని పార్టీలు అమెరికా వేదికగా ప్రణాళికలు చేస్తున్నాయని సమాచారం. రెండు వేల నోట్ల రూపాయల రద్దు నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల ఖర్చు కోసమే అన్ని పార్టీలు అమెరికాకు పయనమవుతున్నట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img