Homeహైదరాబాద్latest Newsఆత్మరక్షణ కోసం మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకోవాలి

ఆత్మరక్షణ కోసం మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకోవాలి

– డ్రాగన్ స్వార్డ్ కుంగ్ ఫూ అకాడమీ ఫౌండర్ రాయమల్లు

ఇదేనిజం, లక్షెట్టిపేట: ఆత్మరక్షణ కోసం విద్యార్థులు మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకోవాలని డ్రాగన్ స్వార్డ్ కుంగ్ ఫూ అకాడమీ ఫౌండర్ మాస్టర్ రాజమల్లు సూచించారు. సోమవారం పట్టణంలోని గురునానక్ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు కరాటే బెల్ట్​లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… కుంగ్ ఫూ నేర్చుకుంటే ఆత్మ స్థైర్యంతో పాటు ఆత్మ నిబ్బరం అలవడుతుందన్నారు. లక్షెట్టిపేట నుంచి 50 మంది విద్యార్థులు పోటీలో పాల్గొంటే 37 మంది ఎల్లో బెల్ట్, పర్పల్ బెల్ట్ ఒకటి, గ్రీన్ బెల్ట్ ఒకటి గెల్చుకున్నరన్నారు. వారికి రాయమల్లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రాగన్ కుంగ్ ఫూ అకాడమీ అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి కస్తూరి ప్రవీణ్, సీనియర్ మాస్టర్లు రమణ, ముజాయిద్, చంద్రయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img