HomeసినిమాLegendary comedian Brahmanandam in Indian-2 Indian-2 లో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం

Legendary comedian Brahmanandam in Indian-2 Indian-2 లో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం

టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం 2019లో హార్ట్ ఆపరేషన్ తర్వాత సినిమాలను తగ్గించారు. 2020లో వచ్చిన అల వైకుంఠపురం మూవీలో ఓ పాటలో కనిపించిన ఆయన.. కరోనా పీరియడ్​ రావడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, 2021లో జాతి రత్నాలు సినిమాలో మళ్లీ కనిపించి తన ట్రేడ్​ మార్క్​ కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది రిలీజైన రంగమార్తాండ మూవీలో ఫుల్​ లెంగ్త్​ రోల్​లో నటించి.. కామెడీతో పాటు ట్రాజెడీని సైతం పండించగలనని మరోసారి నిరూపించారు. మళ్లీ ఫుల్​ లెంగ్త్​ రోల్​లో కనిపిస్తున్న ఆయనకు తగ్గ సాలిడ్​ పాత్రలు తక్కువే వస్తున్నాయన్న టాక్​ ఉంది. అయితే, లేటెస్ట్​గా తరుణ్​ భాస్కర్ తీసిన ‘కీడా కోలా’ మూవీలో బ్రహ్మీ కాస్త ఎక్కువ సేపు కనిపించి అలరిస్తారని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్​కు కిక్ ఇచ్చే మరో ఇంట్రెస్టింగ్ బజ్ బయటికి వచ్చింది. దర్శకుడు శంకర్
లోక నాయకుడు కమల్​హాసన్​తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘భారతీయుడు–2’లో బ్రహ్మానందం కూడా ఒక పార్ట్ అని ఇప్పుడు కన్ఫార్మ్ అయ్యింది. శంకర్ పెట్టిన లేటెస్ట్ ట్విట్టర్ పోస్ట్​లో అయితే బ్రహ్మానందం పేరుని కూడా మెన్షన్ చేయడంతో ఈ లెజెండరీ నటుడిని భారీ సినిమాలో చూడబోతున్నట్లు ఖరారైంది. అయితే, ఈ మూవీలో బ్రహ్మనందం ఎలాంటి క్యారెక్టర్​లో కనిపించనున్నారో చూడాలంటే మూవీ రిలీజ్​ వరకు వేచి చూడాల్సిందే.

Recent

- Advertisment -spot_img