Homeసినిమా'Leo' bookings are overwhelming in Telugu states Telugu States ​లో ‘Leo’ అదిరిపోయే...

‘Leo’ bookings are overwhelming in Telugu states Telugu States ​లో ‘Leo’ అదిరిపోయే బుకింగ్స్

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్​గా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సెన్సేషనల్ యాక్షన్ మూవీ ‘లియో. ఈ మూవీపై హైప్ వేరే లెవెల్​లో ఉంది. ఏండ్లుగా తెలుగులో మార్కెట్ కోసం ట్రై చేస్తున్న విజయ్​.. లియో సినిమాతో భారీ స్థాయికి చేరుకున్నాడు. ఇది వరకు తన సినిమాలకు సంబంధించి తెలుగులో ప్రమోషన్లు, ప్రీ రీలీజ్​కు విజయ్ హాజరుకాకుండా డైరెక్టర్లు, నిర్మాతలతో నడిపించేసేవారు. ఈసారి ప్రీ రిలీజ్, ప్రమోషన్ ఈవెంట్లు లేకుండా తెలుగు స్టేట్స్​లో ‘లియో’కు అడ్వాన్స్​ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ నెల 19న లియో రిలీజ్ కానుండగా బుక్​ మై షో యాప్​లో తెలుగు స్టేట్స్​లోని థియేటర్లలో ఫస్ట్​డే టికెట్లన్నీ దాదాపు బుకింగ్ అయిపోయాయి. అదే విధంగా యూఎస్ మార్కెట్​లోనూ లియో ఓ సెన్సేషనల్ రికార్డ్ అందుకున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. గ్లోబల్ హిట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కేవలం ప్రీమియర్స్ తో 1 మిలియన్ డాలర్లు గ్రాస్ అందుకున్న ఏకైక సినిమాగా లియో నిలిచిందంటున్నారు. ఈ మూవీకి సంగీత సంచలనం అనిరుధ్​ మ్యూజిక్ అందించగా.. 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

Recent

- Advertisment -spot_img