ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్గా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సెన్సేషనల్ యాక్షన్ మూవీ ‘లియో. ఈ మూవీపై హైప్ వేరే లెవెల్లో ఉంది. ఏండ్లుగా తెలుగులో మార్కెట్ కోసం ట్రై చేస్తున్న విజయ్.. లియో సినిమాతో భారీ స్థాయికి చేరుకున్నాడు. ఇది వరకు తన సినిమాలకు సంబంధించి తెలుగులో ప్రమోషన్లు, ప్రీ రీలీజ్‌కు విజయ్ హాజరుకాకుండా డైరెక్టర్లు, నిర్మాతలతో నడిపించేసేవారు. ఈసారి ప్రీ రిలీజ్, ప్రమోషన్ ఈవెంట్లు లేకుండా తెలుగు స్టేట్స్లో ‘లియో’కు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ నెల 19న లియో రిలీజ్ కానుండగా బుక్ మై షో యాప్‌లో తెలుగు స్టేట్స్‌లోని థియేటర్లలో ఫస్ట్‌డే టికెట్లన్నీ దాదాపు బుకింగ్ అయిపోయాయి. అదే విధంగా యూఎస్ మార్కెట్లోనూ లియో ఓ సెన్సేషనల్ రికార్డ్ అందుకున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. గ్లోబల్ హిట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కేవలం ప్రీమియర్స్ తో 1 మిలియన్ డాలర్లు గ్రాస్ అందుకున్న ఏకైక సినిమాగా లియో నిలిచిందంటున్నారు. ఈ మూవీకి సంగీత సంచలనం అనిరుధ్ మ్యూజిక్ అందించగా.. 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.
‘Leo’ bookings are overwhelming in Telugu states Telugu States లో ‘Leo’ అదిరిపోయే బుకింగ్స్
RELATED ARTICLES