Homeసినిమా'Leo' Mania.. a couple who got married in the theater ‘Leo’ మేనియా.....

‘Leo’ Mania.. a couple who got married in the theater ‘Leo’ మేనియా.. థియేటర్​లో Marriage చేసుకున్న Couple

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: తమిళ స్టార్ నటుడు, ఇళయ దళపతి విజయ్ నటించిన లియో గురువారం థియేటర్​లో రిలీజై సందడి చేస్తున్నది. ‘లియో’ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా కొంత మిక్స్​డ్ టాక్​ను తెచ్చుకున్నప్పటికీ యాక్షన్, ఎమోషనల్​ సీన్లు అదిరిపోవడంతో విజయ్​ ఫ్యాన్స్​ థియేటర్లలో ఊగిపోతున్నారు. థియేటర్ల బయట పటాకులు కాలుస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే, చెన్నైలోని ఓ అభిమాన జంట మాత్రం ఏకంగా దండలు మార్చుకుని ఒకటయ్యారు. చెన్నైకు చెందిన వెంకటేశ్, మంజుష అనే జంట పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లి కోసం 8 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న లియో రిలీజ్ కావటం వల్ల.. పెళ్లిని ఆ తర్వాత రోజు అక్టోబర్ 20న పెట్టుకున్నారు. థియేటర్​కు సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ప్రేక్షకుల ముందు దండలు ఉంగరాలు మార్చకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img