Homeహైదరాబాద్latest Newsకలిసి కదులుదాం.. మరోసారి మోడిని ప్రధానిగా గెలిపిద్దాం..

కలిసి కదులుదాం.. మరోసారి మోడిని ప్రధానిగా గెలిపిద్దాం..

– జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

ఇదే నిజం, కొమురం భీం జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ దగ్గర బీజేపీ తన విజయ సంకల్పయాత్ర బహిరంగ రోడ్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సొయం బాబురావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, అదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కలిసి కదులుదాం.. మరోసారి మోడిని ప్రధానిగా గెలిపిద్దామని నినాదించారు. ఆ లక్ష్యంతోనే తెలంగాణ బీజేపీ ఈ విజయసంకల్ప యాత్ర నిర్వహిస్తోందని తెలిపారు. ఈ యాత్రను ప్రజలు విజయవంతం చేయాలని, మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img