HomeసినిమాLiger : రౌడీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రీరిలీజ్ డేట్ వచ్చేసింది

Liger : రౌడీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రీరిలీజ్ డేట్ వచ్చేసింది

Liger : రౌడీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రీరిలీజ్ డేట్ వచ్చేసింది

Liger : తెలుగు ఇండస్ట్రీలో రౌడీ స్టార్‌గా పేరుగాంచిన విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రంతో ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని రౌడీ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు సామాజిక మాధ్యమాల్లో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

ఈ క్రమంలో విజయ్ ఫ్యాన్స్‌కు చిత్రబృందం గురువారం రాత్రి ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.

ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించింది.

‘లైగర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్ అయ్యింది. ఆగస్ట్ 20వ తేదీన గుంటూరులోని చలపతి ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ ప్రీరిలీజ్ వేడుక జరుగుతుంది’ అని మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇక, ఈ ‘లైగర్’ చిత్ర విషయానికొస్తే.. కరణ్‌జోహర్‌, ఛార్మీతో కలిసి పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు.

ముంబైలోని ఓ చాయ్‌ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.

విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్‌గా నటించింది.

ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు.

ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకొని, ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది.

Recent

- Advertisment -spot_img