హైదరాాబాద్ : విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలకు లైన్ క్లియర్ అయింది. యూనిఫాం పాలసీని రూపొందించాలంటూ విద్యుత్ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్ ఆఫీసులకు సీఎండీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకాలు ఇవ్వకుండా మార్చి 4, 2020న జరిగిన 42వ బోర్డు సమావేశంలో గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29, 2020న విడుదల చేసిన ఉత్తర్వులను తాజాగా రేవంత్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గతంలో కారుణ్య నియామకం కోసం అప్లయ్ చేసుకున్నవారికి మళ్లీ అప్లికేషన్ ప్రొఫార్మా (ఫార్మాట్)ను రూపొందించాలని సూచించారు.