Homeహైదరాబాద్latest Newsలిక్కర్ స్కాం కేసు సీబీఐ చేతిలోకి..బీజేపీకి ఏం లాభం?

లిక్కర్ స్కాం కేసు సీబీఐ చేతిలోకి..బీజేపీకి ఏం లాభం?

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ముచ్చటగా మూడోసారి గెలుపుకు బీజేపీ అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఓ వైపు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ప్రతిపక్షాలకు ఊపరి సలపకుండా చేస్తోంది. దేశ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం జోక్యాన్ని సీరియస్‌గా తీసుకొని నోళ్లు మూయిస్తోంది. మరోవైపు గెలుపు విషయం దేవుడెరుగు కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వాలని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 25 గ్యారంటీలతో మ్యానిఫెస్టో రిలీజ్ చేసింది.

రైల్వేల ప్రైవేటీకరణ, అగ్నవీర్ స్కీం రద్దు వంటి వివాదాస్పద అంశాలపై కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు స్పష్టతనిచ్చింది. దీంతో దేశప్రజల దృష్టిని ఆకర్షించింది. ఎక్కడ ఈ విషయాలు ప్రతికూలంగా తయారవుతాయోనని భారతీయ జనతా పార్టీ ముందుగానే స్కెచ్ గీసి పెట్టుకున్నట్టుంది. సరిగ్గా కాంగ్రెస్ మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన రోజే దిల్లీ లిక్కర్ స్కాంలోకి సీబీఐని దింపింది.

కవితను ప్రశ్నించాలంటూ దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన పిటిషన్‌కు కోర్టు కొన్ని పరిమితులతో అనుమతినిచ్చింది. దీంతో ప్రజలకు మరో కొత్త సబ్జెక్టును ఇచ్చినట్లయింది. తదనుగుణంగా ప్రజలు కాంగ్రెస్ హామీల గురించి కాకుండా సీబీఐ గురించి మాట్లాడుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత కొంత కాలంగా సీరియల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ కేసు పురోగతి జరుగుతోంది. ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందోనని ఆత్రంతో ఎదురుచూసేవారు అనేకమంది ఉన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో ఇది ఎక్కువగా ఉంది. కారణం మన సీఎం కుమార్తె జోక్యం. విమర్శలు, వ్యతిరేకత ఎదురైనప్పుడల్లా కొత్త విషయాలపై ఇంట్రెస్ట్ చూపి ప్రజల ఆలోచనా విధానాన్ని మారుస్తుంటాయి ప్రభుత్వాలు. ఇటువంటి ఉదంతాలు ఇప్పటివరకు ఎన్నో జరిగాయి. మరి తాజాగా సీబీఐ రంగంలోకి దిగడంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ లిక్కర్ స్కాం కేసు బీజేపీకి ఏ విధంగా లాభపడుతుందో వేచిచూడాలి.

Recent

- Advertisment -spot_img