Homeహైదరాబాద్latest Newsలిక్కర్ స్కాం.. ఇక సీబీఐ వంతు

లిక్కర్ స్కాం.. ఇక సీబీఐ వంతు

Delhi : దిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతించాల్సిందిగా దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తిహాడ్ జైలులోనే ప్రశ్నిస్తామని అభ్యర్థన. ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరమని కోర్టుకు విన్నవించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సీబీఐ ఎంట్రీతో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రశ్నించడానికి ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. ల్యాప్‌టాప్, ఇతర స్టేషనరీ తీసుకెళ్లొచ్చని కోర్టు అనుమతిచ్చింది.

Recent

- Advertisment -spot_img