Homeహైదరాబాద్latest Newsఅక్షరాస్యతపై అవగాహన

అక్షరాస్యతపై అవగాహన

ఇదేనిజం, జగిత్యాల టౌన్ : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దరూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల రూరల్ మండలం వడ్డెర కాలనీలోని ప్రజలకు బ్యాంకులో ఉన్న ఇన్సూరెన్స్‌లు, రుణాల గురించి, డిజిటల్ లావాదేవీలపై విభూది బ్రదర్స్ కళాజాత వారు మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మసూద్, సర్పంచ్ రాజమణి గంగాధర్, ఉప సర్పంచ్ నాగవ్వలక్ష్మణ్, ఏపీఎం గంగాధర్, సీసీపీ గంగారాం, వీవోఏ మమత, కళాజాత సభ్యులు రవి, వెంకటేశ్, ఖాతాదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img