Homeహైదరాబాద్latest Newsరుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి

రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్ రుణం తీసుకున్న ప్రతి రైతుకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీని దశలవారీగా మాఫీ చేస్తున్న క్రమంలో సాంకేతిక లోపాలతో ఆధార్ కార్డు లింక్ లేక రుణం రైతుల ఖాతాలలో జమ అవడం లేదని ధరణిలో భూమి ఉన్న లింక్ చూపడం లేదని వ్యవసాయ అధికారులు సాంకేతిక తొలగించి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు. రుణమాఫీ కానీ పక్షంలో రైతులతో ధర్నాలు రాస్తారోకులు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్, కార్యదర్శి క్రాంతి, ఎల్ల గిరిధర్ రెడ్డి బాల్ రెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img