Lockdown | లాక్‌డౌన్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Lockdown | రాష్ట్రంలో లాక్‌డౌన్ విధింపుపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్విట్టర్‌లో గురువారం ఆయన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. రాష్ట్రంలో కేసుల సంఖ్య, వైద్యాశాఖ అధికారుల సలహాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నెటిజన్ల నుంచి వచ్చిన మరికొన్ని ప్రశ్నలకు సైతం కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా? అని ఓ నెటిజన్ అడగ్గా.. భవిష్యత్‌లో ఏం రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసన్నారు.
మరో నెటిజన్ వేసిన ప్రశ్నకు రేవంత్ వంటి నేరస్థులు, 420తో నేను చర్చల్లో పాల్గొననని.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ చర్చించవచ్చని సమాధానం ఇచ్చారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీకి మద్దతుగా టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుందా? అన్న ప్రశ్నకు.. చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ అన్నారు.
Visa : శక్తిమంతమైన పాస్ పోర్ట్ జాబితాలో భారత్.. వీసా లేకుండా 60 దేశాలకు
Divorce : నచ్చని పాటకు డ్యాన్స్ చేసిందని పెళ్లిరోజే విడాకులిచ్చిన వరుడు
Heart Transplant : పంది గుండెను మనిషికి అమర్చిన అమెరికా డాక్టర్లు