Homeహైదరాబాద్latest Newsఅరుదైన ఘనత సాధించిన ‘మ ఊరి పొలిమెర 2’…!

అరుదైన ఘనత సాధించిన ‘మ ఊరి పొలిమెర 2’…!

‘మ ఊరి పొలిమెర’ చిత్రం ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌తో మేకర్స్ “మ ఊరి పొలిమెర 2″ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గతేడాది థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసందే. ఈ సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, దేవయాని శర్మ, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. రేపు న్యూ ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ – 2024లో ఈ చిత్రం అధికారికంగా ఎంపిక చేయబడింది. ఈ సినిమాని దక్కిన గౌరవం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించారు. ఈ సినిమాలో బాలాదిత్య, చిలం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img