Homeహైదరాబాద్latest Newsమాఘమాసం పెండ్లిళ్ల సీజన్​.. ఎన్ని లక్షల పెళ్లిల్లు ఉన్నాయో తెలుసా

మాఘమాసం పెండ్లిళ్ల సీజన్​.. ఎన్ని లక్షల పెళ్లిల్లు ఉన్నాయో తెలుసా

ఇది మాఘమాసం. ఈ మాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని, మరే నెలలోనూ ఇంతటి అద్భుత ఘడియలు ఉండవని బ్రాహ్మణ పండితులు చెబుతుంటారు. అందుకే.. వివాహాలు, గృహ ప్రవేశాలు సహా చాలా శుభకార్యాలను మాఘ మాసంలో జరిపిస్తుంటారు. ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ డేటా’ ప్రకారం.. 2024 జనవరి 15 నుంచి 2024 జులై 15 వరకు ఉన్న ఆరు నెలల వెడ్డింగ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా 42 లక్షల వివాహాలు జరగనున్నాయట. ఈ కాలంలో వివాహ సంబంధిత కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చుల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు 5.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. పెళ్లి ఖర్చుల రూపంలో దేశవ్యాప్తంగా మార్కెట్లలోకి భారీగా నగదు ప్రవాహం మొదలవుతుంది.

Recent

- Advertisment -spot_img