Homeహైదరాబాద్latest Newsఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు


ఇదే నిజం, రామగిరి : ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని బీజేపీ మండల అధ్యక్షుడు మూల్మూరి శ్రీనివాస్ అన్నారు. ఫూలే జయంతిని పురస్కరించుకుని సెంటినరీ కాలని మార్కెట్ చౌరస్తా పూలే 198వ జయంతి వేడుకలు బీజేపీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అంటూ ఫూలే సేవలను గుర్తు చేసుకున్నారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయి ని విద్యావంతురాలి ని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పూలేకు నిజమైన నివాళులు అని పేర్కొన్నారు. మోలుమూరి శ్రీనివాస్, తీగల శ్రీధర్, మెరుగు శ్రీకాంత్, దోంత్తుల సురేష్, కోటి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img