HomeసినిమాMajor Movie Review : మేజర్ సినిమా ఎలా ఉందంటే?

Major Movie Review : మేజర్ సినిమా ఎలా ఉందంటే?

Major Movie Review : మేజర్ సినిమా ఎలా ఉందంటే?

Major Movie Review : రన్ టైమ్: 2 గంటల 10 నిమిషాలు
నటీనటులు: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాల్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
ఎడిటర్ : పవన్ కళ్యాణ్
మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: సోని ఎంటర్ టైన్మెంట్స్, జి.ఎమ్.బి ఎంటర్ టైన్మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్
రచన,దర్శకత్వం : శశికిరణ్ తిక్క
రిలీజ్ డేట్ : జూన్ 3,2022.

26/11 ముంబై దాడుల్లో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ”మేజర్” మూవీ తెరకెక్కింది.

ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు అయిన అడవి శేష్ మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీని గూడచారి ఫేం శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేశాడు.

మహేష్ బాబు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం వల్ల నేషనల్ వైడ్ పబ్లిసిటీ దక్కింది.

తెలుగు, హిందీ మలయాళ భాషలో తెరకెక్కిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా ప్రీమియర్ షో లు వేయడం వల్ల ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.

అడవిశేష్ తో సహా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు.

క్షణం, గూడాచారి,ఎవరు లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాల తో దూసుకెళ్తున్న శేష్ కు ఈ సినిమా ద్వారా మరో విజయం దక్కిందనే చెప్పాలి.

ఓ సైనికుడు ఎలా ఉండాలి అనేదానికి ఉదాహరణే ఈ మూవీ. సందీప్ ఉన్నికృష్ణన్ దేశానికి చేసిన సేవను ఈ చిత్రంలో ద్వారా చాలా బాగా చెప్పారు.

2008 నవంబర్ 26న తాజ్ హోటల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని కళ్లకు కట్టినట్టు ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ శశికిరణ్.

మేజర్ సందీప్ తన ధైర్య సాహసాలతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చాలా మందిని ఎలా కాపాడాడో ఈ సినిమా ద్వారా చూడొచ్చు.

ఇంటర్వెల్ ముందు నుండి సెకండాఫ్ చివరి దాకా చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది.

అంతే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో దేశభక్తిని చాటుతుంది ఈ సినిమా.

ప్రతీ ఒక్కరూ సినిమాలో లీనమై భావోద్వేగానికి లోనవుతారు. కొన్ని సీన్లకు చప్పట్లు కొట్టకుండా ఉండలేం.

అలా పకడ్బందీగా రాసుకున్నందుకు శేష్ ను, డైరెక్టర్ శశిని అభినందించల్సిందే అంటున్నారు సినీ ప్రేక్షకులు.

సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. కానీ ఆయన ఎలా జీవించారో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆయన సోల్జర్ గానే కాకుండా ఒక కొడుకుగా, భర్త గా ఎలా ఉండేవాడనేది ఈ సినిమా చెప్తుంది.

తన ఎమోషనల్ జర్నీ ని పరిచయం చేసింది. సందీప్ రోల్ లో అడవిశేష్ జీవించి నటించాడని చెప్పాలి.

ఆర్మీ ఆఫీసర్ గా ఆ ఆహార్యం, లుక్స్ సరిగ్గా సరిపోయాయి.

డైరెక్టర్ శశి కూడా చాలా నైఫుణ్యంతో ఈ సినిమాను తీర్చి దిద్దాడు.

ఎక్కడా కూడా బోర్ కొట్టనివ్వకుండా తీశాడు. ఫస్టాఫ్ లో లవ్ ఎపిసోడ్ కాస్త స్లో గా అనిపించినా ఇంటర్వెల్ ముందు నుండి సినిమా ఊపందుకుంటుంది.

సాయి మంజ్రేకర్ బాగా చేసింది. శోభిత ధూళిపాల్ల ఒక ఇంపార్టెంట్ రోల్ లో రాణించింది.

తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతిల నటన అధ్బుతం అని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తారు.

వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ తెప్పించాడు.

ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూయ్స్, ఆర్ట్ వర్క్ అన్నీ బాగున్నాయి.

నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా తీశారు. మహేష్ బాబు లాంటి స్టార్ ఈ సినిమా వెనక ఉండటం అభినందనీయం.

ఓవరాల్ గా మేజర్ మూవీ మెప్పిస్తుంది.. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథను తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే.

తెలుగులోనే కాకుండా నేషనల్ వైడ్ గానూ ఈ సినిమా కు మంచి గుర్తింపు వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఫైనల్ గా ఇది అందరూ చూడదగ్గ చిత్రం.

Recent

- Advertisment -spot_img