Homeహైదరాబాద్latest Newsసమ్మక్క జాతరను జాతీయ పండగ చేయండి

సమ్మక్క జాతరను జాతీయ పండగ చేయండి

– హిందూ ధర్మ ప్రచారక్ సతీశ్​

ఇదే నిజం,ఇనుగుర్తి: మేడారం సమ్మక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల హిందూ ధర్మ ప్రచారక్ బొమ్మెర సతీశ్​ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇనుగుర్తిలో మీడియాతో మాట్లాడారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారక్కలను దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారని చెప్పారు. జాతరకు కుంభమేళాను తలపించే విధంగా పలు రాష్ట్రాల నుంచి కోట్లాదిమంది హాజరవుతున్నారన్నారు. అందుకే ఈ జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారానికి కేవలం రూ.3 కోట్లు ప్రకటించడం సరైంది కాదన్నారు. శాశ్వత పనులకోసం జాతరలో రూ. 300 కోట్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు. దీంతో సౌకర్యాలు మరింత మెరుగుపడి, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నారు.

Recent

- Advertisment -spot_img