Homeతెలంగాణయూపీఐ పేమెంట్ చేస్తున్నారా? జర భద్రం..!

యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? జర భద్రం..!

నేడు అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతుల్లో ఒకటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI). నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ దేశంలోని చెల్లింపు వ్యవస్థలో అనేక మార్పులను తీసుకొచ్చింది. నగదు పంపించేందుకు మాత్రమే క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయాలి. రిసీవ్ కు స్కాన్ అవసరం లేదు. UPI పిన్ ఎవరికీ చెప్పకూడదు. మీరు పేమెంట్ చేసేటప్పుడు మాత్రమే పిన్ ఎంటర్ చేయాలి. కొత్త నంబర్లు, క్యూఆర్ కోడ్లకు నగదు పంపే ముందు అక్కడ వచ్చిన పేరు వారిదేనా, కాదా చెక్ చేయాలి. అపరిచితుల నుంచి ఆఫర్లు పేర వచ్చిన లింకులను క్లిక్ చేయొద్దు. ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నందున వాటిలో బ్యాంకింగ్ వివరాలు సేవ్ చేయొద్దు.

Recent

- Advertisment -spot_img