HomeసినిమాMalayalam actress sexually assaulted in flight మలయాళ నటికి ఫ్లైట్​లో లైంగిక వేధింపులు

Malayalam actress sexually assaulted in flight మలయాళ నటికి ఫ్లైట్​లో లైంగిక వేధింపులు

– కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన దివ్య ప్రభు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. మంగళవారం ముంబై నుంచి కొచ్చికి ఎయిర్‌ ఇండియా ఏఐ 681 విమానంలో ప్రయాణించింది. ఆ సమయంలో పక్క సీటులో ఉన్న వ్యక్తి తనను వేధింపులకు గురి చేసినట్లు నటి వెల్లడించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ‘మద్యం మత్తులో ఓ వ్యక్తి 12సీ సీటులో కూర్చున్నాడు. తర్వాత తన సీటును 12బీకి మార్చుకుని, నా పక్క సీటు (12ఏ)లోకి చేరాడు. విండో సీటు కోసం నాతో వాగ్వాదానికి దిగాడు. నన్ను భౌతికంగా తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.

నేను ఈ విషయాన్ని వెంటనే ఎయిర్ హోస్టెస్‌కు దృష్టికి తీసుకెళ్లాను. దీంతో వారు విమానం టేకాఫ్‌కు కొద్ది సేపటికి ముందు నా సీటును మార్చారు. కానీ, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ఇండియా ఆఫీస్ సిబ్బందికి చెప్పాను. దాంతో పోలీసుల సాయం పొందాలని వారు నాకు సూచించారు. దీంతో నేను ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్‌ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశాను’అని నటి వివరించింది.

Recent

- Advertisment -spot_img