Homeహైదరాబాద్latest Newsదుర్గంధభరితంగా మల్లయ్య కుంట.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు

దుర్గంధభరితంగా మల్లయ్య కుంట.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు

ఇదేనిజం, శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ 21 హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోమంజీరా పైపులైన్ రోడ్డు ఆనుకోని ఆర్టీసీ కాలనీ ,హుడా కాలనీల మధ్య ఉన్న మల్లయ్యకుంట దుర్గంధ భరితంగా మారింది. మొన్న కురిసిన భారీ వర్షానికి మురుగు వరద చేరడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. చుట్టూ రెండు కాలనీలు పైగా నిత్యం ఎంతోమంది ఈ రూట్లో ప్రయాణించేవారు అందులో నుంచి వెలువడే దుర్గంధంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని కాలనీ వాసులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుడాకాలనీ, పాపిరెడ్డి కాలనీల, ఎగువ భాగంనుంచి వరద, నివాస గృహాల మురుగు ఇక్క డికి వచ్చి చేరుతుంది. అధికారులు దృష్టి సారించకపోవడంతో రెండు కాలనీల మధ్య ఉన్న చెరువులో మురుగు నిలిచిపోతోంది.

ఆర్టీసి ,హుడా కాలనీల మధ్య మురుగుకూపం..
రెండు కాలనీలు ఆర్టీసీ, హుడా కాలనీల మధ్యనే ఉన్న మల్లయ్య కుంట మురుగుకూపంగా తయారుకావడంతో దుర్వాసన భరించలేక ఇంటికి తాళం పెట్టి మరోచోట ఉంటున్నామని కొందరు చెప్పడం సమస్య తీవ్రతను అద్దం పడుతోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా అప్ట్టించుకోవడంలేదు. దీం తో మురుగంతా చెరువులో చేరి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో దోమలు, ఇతర కీటకా లతో ఆనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు అవేదనవ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

కుంటను సుందరీకరణ చేసినా తప్పని తిప్పలు..
గతంలో మల్లయ్య కుంటను సుందరికరించారు. అందులో భాగంగా చుట్టూ ఉన్న కాలనీల నుంచి వెలువడే మురుగు కుంటలో చేరకుండా చర్యలు తీసుకున్నారు. కానీ షరామామూలే అన్నట్లు కుంటలో మళ్ళీ మురుగు చేరడంతో సుందరీకరణ పనులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి రెండు, మూడేళ్లు గడవక ముందే ఇలా సమస్యలు మొదటికి రావడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img