Homeహైదరాబాద్latest News'అన్నా..నువ్వే గెలుస్తావ్' : మల్లారెడ్డి

‘అన్నా..నువ్వే గెలుస్తావ్’ : మల్లారెడ్డి

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు మల్లారెడ్డి తన వాక్ చాతుర్యంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయన మాటలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఓ వేడుకకు హాజరైన మల్లారెడ్డి, ఈటల రాజేందర్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈటలను చూసి .. “అన్నా..మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్. మా అన్నతో ఫోటో తీయండి మళ్లీ ఎప్పుడు కలుస్తామో..నువ్వెక్కడో నేనెక్కడో” అంటూ అక్కడున్నవారందరి ముఖాల్లో నవ్వులు పూయించారు. బదులుగా ఈటల నవ్వుతూ కనిపించారు. ఈ వ్యవహారంపై కొందరు లోతుగా విశ్లేషిస్తుండగా..జస్ట్ ఫర్ ఫన్ అంటూ మరికొందరు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img