Homeజాతీయంఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ వీడియో సందేశం

ఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ వీడియో సందేశం

West Bengal Chief Minister Mamata Banerjee has asked her party leaders and activists to keep everyone calm.

It is learned that she was injured in an attack in Nandigram yesterday.

She is currently being treated at a hospital in Kolkata. In the wake of this she sent a message via video to her party ranks.

అందరూ ప్రశాంతంగా ఉండాలని తన పార్టీ నేతలు, కార్యకర్తలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.

నందిగ్రామ్ లో నిన్న జరిగిన దాడిలో ఆమె గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో తన పార్టీ శ్రేణులకు ఆమె వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు.

ప్రశాంతంగా ఉండాలని, నియంత్రణను పాటించాలని అందరినీ కోరుతున్నానని మమత అన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పారు. తన కాలు, మోకాలికి గాయాలు అయిన సంగతి నిజమేనని తెలిపారు.

లిగమెంట్ గాయపడిందని తెలిపారు. ఛాతీ నొప్పితో బాధపడ్డానని చెప్పారు. తన కారులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తుండగా… కారు డోరు నొక్కుకుపోయిందని అన్నారు.

ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని… రెండు, మూడు రోజుల్లో తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.

కాలి గాయం కొన్ని రోజుల పాటు బాధిస్తూనే ఉంటుందని… అయినప్పటికీ మేనేజ్ చేసుకుంటానని చెప్పారు.

వీల్ ఛైర్ లో తిరుగుతానని… మీ అందరి మద్దతు తనకు కావాలని అన్నారు.

Recent

- Advertisment -spot_img