Homeహైదరాబాద్latest Newsభార్య హత్య కేసులో భర్తకు జీవిత కాలం జైలుశిక్ష, జరిమానా

భార్య హత్య కేసులో భర్తకు జీవిత కాలం జైలుశిక్ష, జరిమానా

ఇదేనిజం, కొమురంభీం ఆసిఫాబాద్ : భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించింది అసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంవీ రమేశ్ తీర్పు ఇచ్చారు. కాగజ్ నగర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ బాబాజీ తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో పెంచికల్‌పేట్ మండలం మురళిగూడకు చెందిన కమెర శ్రీనివాస్ తన భార్య కమెర లక్ష్మి(43)ని హత్య చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా ఈరోజు పీపీ జగన్మోహన్ రావు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో.. శ్రీనివాస్‌కు జీవిత కాలం జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది కోర్టు. శ్రీనివాస్ ఆస్తిని పిల్లల పేరు మీద జమ చేయాలని తహసీల్దార్ కు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత కాగజ్ నగర్ రూరల్ సీఐ రాంబాబు, పెంచికల్ పేట ఎస్సై కొమురయ్య, కోర్ట్ సిబ్బందిని ఎస్పీ సురేష్ కుమార్ అభినందించారు.

Recent

- Advertisment -spot_img