మంచు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. అయితే మోహన్ బాబు, ఆయన కొడుకు మనోజ్ మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగి, ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. మనోజ్ గాయాలతో వచ్చి మరీ కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మంచు మనోజ్ కుంటుకుంటూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మంచు మనోజ్‌కి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మోహన్ బాబు అనుచరుడు వినయ్ మరియు అతని స్నేహితులు కలిసి దాడి చేశారంటూ ఆరోపణలు చేసారు. ఈ వీడియోల్లో మంచు మనోజ్‌తో పాటు అతని భార్య మౌనిక కూడా ఉన్నారు. ఈ క్రమంలో హీరో మనోజ్ పై మోహన్ బాబు దాడి చేసిన మాట వాస్తవమేనని తెలుస్తుంది.