HomeసినిమాManoj Bhajpayee: ఆరు గెట‌ప్‌లు.. ఒక్కో గెట‌ప్ మెక‌ప్‌కి 4 గంట‌లు

Manoj Bhajpayee: ఆరు గెట‌ప్‌లు.. ఒక్కో గెట‌ప్ మెక‌ప్‌కి 4 గంట‌లు

ముంబాయిః సినీ ఇండ‌స్ట్రీలో ఏ పాత్ర‌లోనైనా ఇమిడిపోయే న‌టులు కొందరుంటారు. వారిలో మ‌నోజ్ భాజ్‌పేయి ఒక‌రు.

తెలుగులో మ‌నోజ్ ప్రేమ‌క‌థ‌, హ్యాపీ, పులి, వేదం వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించాడు.

తాజాగా దిల్జీత దోసాంజ్‌, ఫాతిమా స‌నా షేఖ్‌ల‌తో క‌లిసి ‘సూర‌జ్ పే మంగ‌ళ్ భ‌రీ’ చిత్రంలో న‌టిస్తున్నాడు.

అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సెటైరిక‌ల్ కామెడీ సినిమాగా రూపొందుతుంది.

ఈ సినిమాలో మ‌నోజ్ వెడ్డింగ్ డిటెక్టివ్ గా న‌టిస్తున్నాడు. పాత్ర డిమాండ్ మేర‌కు ఆరు విభిన్న పాత్రాల‌ను పొషిస్తున్నారు.

మ‌హిళ‌గా, బిచ్చ‌గాడిగా, ముస్లిం, సిక్కు వ్య‌క్తిగా ప‌లు పాత్ర‌లు పొషిస్తున్నారు. ఇలా మొత్తం ఆరు గెట‌ప్‌ల‌లో మ‌నోజ్ క‌న్పించ‌నున్న‌ట్లు చిత్ర వ‌ర్గాలు తెలియ‌జేశాయి.

ఒక్కో గెట‌ప్ మేక‌ప్ వేసేందుకు సుమారు 4 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ని, మేక‌ప్ వేస్తున్న దృశ్యాల‌కు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేయ‌డంతో అది వైరల్ అవుతోంది.

మీరు ఓ లుక్ వేయండి మ‌రీ.

Recent

- Advertisment -spot_img