HomeతెలంగాణMaoist:మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Maoist:మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Maoist:మావోయిస్టు అగ్రనేత , పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో దండకారణ్యంలో మృతి చెందాడు ఈ విషయాన్ని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించాడు. మే 31, మధ్యాహ్నం12.20 గంటలకు దండకారణ్యం గెరిల్లా జోన్ లో మృతి చెందాడని ప్రకటించాడు. చాలా రోజులుగా ఊపిరితిత్తులు , డయాబెటీస్, రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు.

యుక్తవయసులోనే నక్సలిజం వైపు అడుగులు వేసాడని చెప్పారు. శ్రీకాకుళం నెక్సల్బరి ఉద్యమాన్ని నిర్మించడం లో కీలక పాత్ర పోషించాడు. సుదర్శన్ అంత్యక్రియలు దండకారణ్యం లో నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన సుదర్శన్ జాతీయ స్థాయి లో ఎదిగాడు. సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన కటకం సుదర్శన్ డిప్లొమా చదువుతూనే పోరాటాల వైపు ఆకర్షితుడయ్యాడు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించాడు. రాడికల్ యూత్ లీగ్ , కోల్ మైన్స్ వర్కర్స్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1978 లో జన్నారం, లక్సెట్టిపేట ఆర్గనైజర్ గా పని చేసాడు. 1987 లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీ లో కి వెళ్ళాడు. 1995 లో నార్త్ జోన్ సెక్రటరీ గా బాధ్యతలు తీసుకున్నారు . సెంట్రల్ కమిటీ లో స్థానం సంపాదించి మావోయిస్టు పార్టీ తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించేవాడు అంతేకాకుండా క్రాంతి, ఎర్రజెండా, పీపుల్స్ వార్, పీపుల్స్ మార్చ్ పబ్లికేషన్స్ కు ఎడిటర్ గా పని చేశాడు

Recent

- Advertisment -spot_img