Homeహైదరాబాద్latest Newsఘనంగా మార్కండేయ మహర్షి జయంతి

ఘనంగా మార్కండేయ మహర్షి జయంతి

ఇదే నిజం, కుమ్రం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మార్కండేయ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దవాగు నది తీరాన గల మార్కండేయ ఆలయంలో గణపతి పూజ, ధ్వజారోహణ, హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి పొట్టి శ్రీరాములు చౌక్, గాంధీ చౌక్, వివేకానంద చౌక్, అంబేద్కర్ చౌక్ ల మీదుగా మార్కండేయ చిత్రపటంతో నిర్వహించిన శోభాయాత్రలో మహిళల కోలాటం ఆకట్టుకున్నది.

Recent

- Advertisment -spot_img