Homeఫ్లాష్ ఫ్లాష్కరోనాలో కల్యాణమస్తు.. జర పైలం

కరోనాలో కల్యాణమస్తు.. జర పైలం

హైదరాబాద్: పెండ్లిల సీజన్ కొనసాగుతోంది. మరో నెల రోజులు పెండ్లిలు ఉన్నాయని పంతుల్లు చెబుతున్నారు. అసలే చలికాలం ఆపై కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది.

పెండ్లిలకు పోయే వారు జర భద్రంగా ఉండాలని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏ పెండ్లిలో చూసిన బంధువులు తండోపతండాలుగా వెళుతున్నారు.

కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నా కనీసం మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు. పెళ్లి ముహూర్తాలు జనవరి 8వ తేదీ వరకు ఉండగా, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు భారీగా సంఖ్యలో ఉన్నాయి.

కనీసం దూరం పాటించడం, మాస్కులను సరైన పద్ధతిలో ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని లురి ఎడల కరోనా కాటుకు బలి కాక తప్పదని వైద్యాధికారులుహెచ్చరిస్తున్నారు.

లాక్‌డౌన్‌ మొదట్లో వధూవరుల కుటుంబాల నుంచి 20 మందికి మించకుండా పిలుచుకొని పెళ్లి చేసుకోవాలని నిబంధన విధించారు.

అన్‌లాక్‌-6లో కల్యాణ మండపాలకు 200 మందికి మించకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతిచ్చాయి.

లాక్‌డౌన్‌ మొదట్లో పరిమిత సంఖ్యలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

డిసెంబర్‌ నెలల్లో జరిగే పెళ్లిళ్లకు హాళ్లు పూర్తిగా బుక్ అయినాయి. భోజనం తయారు చేసేవారు, వసతులు కల్పించే వారు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లు చేసే వారు ఇలా అందరూ మాస్కులు లేకుండానే పని కానిచ్చేస్తున్నారు.

పెండ్లి కి వచ్చే వారిలో ఎరవికైనా కరోనా ఉంటే జరిగే పరిణామాలను ఊహించడం కష్టమే. పెండ్లి నిర్వాహకులే కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు అయ్యేలా బాధ్యత తీసుకోవాలి. దీంతోపాటు ఫంక్షన్‌ హాళ్ల యజమానులు కోవిడ్ జాగ్రత్తలు తెలిపే చిత్రాలను హాళ్లలో అందరికీ కన్పించేలా ఏర్పాటు చేయాలి.

Recent

- Advertisment -spot_img