Britain : మాస్క్ తప్పనిసరి కాదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక లేదు..
Britain : కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటే.. బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కొవిడ్-19 ఆంక్షలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్ జాన్సన్. మాస్కు కూడా తప్పనిసరి కాదని వెల్లడించారు.
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఓవైపు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తుంటే.. యూకేలో కొవిడ్ ఆంక్షలను మొత్తం ఎత్తివేసినట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్ జాన్సన్.
ఇంగ్లాండ్‌లో మాస్క్ తప్పనిసరి నిబంధన సహా ఇతర కొవిడ్ ఆంక్షలన్నింటికీ ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. గరిష్ఠస్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని బోరిస్ తెలిపారు.
Career : ఉద్యోగాలకు రాజీనామాలు.. కొత్త కెరీర్ వైపు చూపులు
Candy Crush Saga : క్యాండీ క్రష్‌ను కొన్న మైక్రోసాఫ్ట్
ఈ నేపథ్యంలో ఇక ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కూడా ఉండదని పేర్కొన్నారు.
”ఒమిక్రాన్ పీక్ దశను అధిగమించిందని దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటినుంచి.. వర్క్ ఫ్రం హోం చేయాలని ప్రభుత్వం ప్రజలను కోరదు.
ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్‌ను మొట్టమొదట అందించింది యూకేనే.”
– బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధానమంత్రి
గత వేసవిలో చాలా మంది వ్యతిరేకించినా దేశంలో కఠిన ఆంక్షలు విధించినట్లు గుర్తుచేసుకున్నారు బోరిస్.
ఇప్పుడు ఇతర దేశాల్లో లాక్‌డౌన్ ఉన్నా.. తాము అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని అన్నారు.
అందుకే జీ-7 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ అవతరించిందని పేర్కొన్నారు.
బూస్టర్ డోసుల పంపిణీ వేగవంతం చేయడం కారణంగానే.. ఒమిక్రాన్ నుంచి బయటపడిన తొలి దేశం తమదేనని అన్నారు యూకే ప్రధాని.
Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు పడకుండా డబ్బు డ్రా చేయడం ఎలా..?
Insurance : ఈ వయసులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..
” ప్లాన్ బీ నిబంధనల పట్ల ప్రజల ప్రతిస్పందనను బట్టి.. ఇప్పుడు ప్లాన్ ఏకు తిరిగి వచ్చాం.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, 1918లో సంభవించిన మహమ్మారి తర్వాత ఇదే మాకు అతి పెద్ద సవాలు.
ఇలాంటి సమయంలో ఏ ప్రభుత్వమైనా కొన్ని తప్పులు చేస్తుంటుంది.”
– బోరిస్ జాన్సన్
ఫేస్ మాస్కులు ధరించడం, కొవిడ్ పాసులు తప్పనిసరి, వర్క్ ఫ్రం హోం వంటివి ప్లాన్- బీ నిబంధనల్లో భాగంగా ఉన్నాయి.
ఇప్పుడు వీటికి ముగింపు పలికింది బ్రిటన్ ప్రభుత్వం.
జనవరి 18న దేశంలో 94 వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 438 మంది మరణించారు.
యూకేలో మొత్తం 5 కోట్ల 20 లక్షల మందికిపైగా టీకా తొలి డోసును పొందగా.. 4 కోట్ల 79 లక్షలకుపైగా టీకా రెండు డోసులను తీసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
3 కోట్ల 65 లక్షల మంది బూస్టర్ డోసును పొందారు.
Jujube : ఈ సీజన్‌లో దొరికే రేగుపండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా
Best Diet : మంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్రపంచంలో మంచి డైట్
కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతటా నిషేధాజ్ఞలు అమలు చేసిన బ్రిటన్‌లో గతేడాది.. ప్రధాని కార్యాలయ సిబ్బందే వాటిని ఉల్లంఘించి విందులు, వినోదాలు జరుపుకున్నారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన స్వయంగా క్షమాపణలు చెప్పినా.. వివాదం సద్దుమణగలేదు.
నిబంధనలు ఉల్లంఘించిన బోరిస్.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బోరిస్ మరోసారి ఆ ఘటనపై వివరణ ఇచ్చారు.
ఆ పార్టీ జరుపుకోవడం కొవిడ్ నిబంధనలకు విరుద్ధమని అధికారులెవరూ తనకు చెప్పలేదన్నారు.
తొలిసారి లాక్‌డౌన్ విధించిన సమయంలో తాము పనిచేస్తున్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశమంతటా ఆంక్షలు ఎత్తివేయడం చర్చనీయాంశమైంది.
Beauty Tips : మొటిమలు, మచ్చల నివారణకు ‘వేప’ ప్యాక్
Antibodies : టీకా తీసుకున్న ఆరు నెలలకే యాంటీబాడీల్లో తగ్గుతున్నాయి