Homeతెలంగాణకాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి

మూడేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగటం బాధాకరం
బ్యారేజీ కుంగితే బీఆర్ఎస్ అధినేత ఎందుకు మాట్లాడలేదు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రులు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొమటిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. మంత్రులతోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌ కూడా ఉన్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అంతకు ముందు మంత్రి ఉత్తమ్ కుమారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం అత్యంత బాధాకరమన్నారు. ప్రాజెక్టులో జరిగిన నష్టానికి కట్టిన వారే బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21న కుంగితే.. డిసెంబర్‌ 3న ప్రభుత్వం మారేవరకు అప్పటి సీఎం కేసీఆర్‌ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మేడిగడ్డ కుంగటం వల్ల ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆయకట్టు మొత్తం దెబ్బతినే పరిస్థితి వచిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తామన్నారు. తక్కువ నష్టం జరిగి ఉండాలనే తాము కోరుకుంటున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు

Recent

- Advertisment -spot_img