Homeఫ్లాష్ ఫ్లాష్ద‌స‌రా రోజుల్లో భారీగా పెరిగిన మందు సేల్స్

ద‌స‌రా రోజుల్లో భారీగా పెరిగిన మందు సేల్స్

హైద‌రాబాద్ః ఈ నెల 22 నుంచి 25 వరకు రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి బయటకు వెళ్లిన మద్యం, బీర్‌ కేసుల విలువ రూ.812 కోట్లకు పైచిలుకే.

అంటే రోజుకు సగటున రూ.203 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడయిందన్న మాట. అదే నెల సగటు చూస్తే రోజువారీ అమ్మకాలు రూ.82 కోట్లు మాత్రమే జరిగాయి.

అంటే దసరా సందర్భంగా మందుబాబులు లిక్కర్ అదే పనిగా పుచ్చుకున్నారన్నమాట!
ఈ నెల మద్యం విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే లిక్కర్, బీర్లు కలిపి దాదాపు 50 లక్షల కేసుల వరకు అమ్ముడయ్యాయి.

వీటి విలువ రూ.2,112 కోట్లుగా ఉంది. ఈ నెల 27 నాటికి 27,08,292 కేసుల లిక్కర్.. 22,65,397 కేసుల బీర్లు డిపోల నుంచి రాష్ట్రంలోని వైన్‌ షాపులకు చేరాయి.

ఇందులో మూడో వంతు దసరా నాలుగు రోజుల్లోనే అమ్ముడైపోయింది. ఈ నాలుగు రోజుల్లో 9,41,900 కేసుల లిక్కర్.. 9,29,694 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img