Homeహైదరాబాద్latest Newsవాల్ పోస్టర్ ను విడుదల చేసిన ఎం సి పి ఐ. (యు)

వాల్ పోస్టర్ ను విడుదల చేసిన ఎం సి పి ఐ. (యు)

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన గోడపత్రికలు వాల్ పోస్టర్స్ ఎం సిపిఐ( యు )పార్టీ గూడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక కొమరం భీం విగ్రహం ముందు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎం సిపిఐ(యు) పార్టీ మహబూబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెంకన్న మాట్లాడుతూ… గూడూరు మండల విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్ తర్వాత డిగ్రీ చదువుల కోసం నర్సంపేట, మహబూబాద్ ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని, అట్లాగనే వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రజల ఆస్తుల రక్షణ నిమిత్తం అగ్నిమాపక కేంద్రం ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వాధికారులు స్పందించి డిగ్రీ కాలేజ్, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ (యు )పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నూకల ఉపేందర్, గూడూరు మండల కార్యదర్శి బందెల వీరస్వామి, నాయకులు కటకం బుచ్చి రామయ్య, ధారావత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img