Homeఫ్లాష్ ఫ్లాష్పనికిమాలిన కుసంస్కారి.. ఒళ్లు దగ్గరపెట్టుకోని మాట్లాడు..

పనికిమాలిన కుసంస్కారి.. ఒళ్లు దగ్గరపెట్టుకోని మాట్లాడు..

ప్రకాష్ కు ఘాటైన సమాధానం ఇచ్చిన నాగబాబు
హైదరాబాద్: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పూటకో పార్టీ మార్చే ఊసరవెల్లి అంటూ ప్రకాష్ చేసిన కామెంట్స్ పై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యాడు.

ప్రకాష్ రాజ్ ఒక కుసంస్కారి అని.. డైరెక్టర్లను కాకా పట్టి నిర్మాతలను డబ్బు కోసం హింసించే నీలాంటి వాడు నీతుల్ని చెబితే ప్రజలు వింటారా అంటూ మెగా బ్రదర్ తన ఫేస్ బుక్ ఫేజీలో ఏకిపారేశాడు.

GHMC ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయడం వెనుక ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉంటాయని.. ఎవడికి పవన్ ఖళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

బీజేపీ జనసేన GHMC ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటవేసుకోకు అంటూ ప్రకాష్ రాజ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు.

Recent

- Advertisment -spot_img