Homeజిల్లా వార్తలు17న ధర్మారంలో మెగా జాబ్‌ మేళా

17న ధర్మారంలో మెగా జాబ్‌ మేళా

ఇదే నిజం, ధర్మారం : పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని స్థానిక సాధన జూనియర్‌ కళాశాలలో ఈనెల 17న ఆదివారం మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ గాజనవేని కుమార్‌ శుక్రరవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 12 కంపెనీలు పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 2015 – 23 సంవత్సరం మధ్య కాలంలో ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌, పీజీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అభ్యర్థులు ఇందుకు అర్హులు అని తెలియజేశారు. ఇందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఫీజు ఉండదని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కోసం ‘8074442121’ గల మొబైల్‌ నెంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ కుమార్‌ కోరారు. ఈ జాబ్‌ మేళా ఆదివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img