Homeహైదరాబాద్latest Newsనేడు హుస్నాబాద్ లో మెగా జాబ్ మేళా

నేడు హుస్నాబాద్ లో మెగా జాబ్ మేళా

ఇదే నిజం, కోహెడ: నేడు (24-06-2024, సోమవారం) సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్ లో జరిగే మెగా జాబ్ మేళాను హుస్నాబాద్ నియోజకవర్గం లోని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చదువుకున్న వారితోపాటు చదువుకొని వారు కూడా ఈ జాబ్ మేళాలో వారి నైపుణ్యాలను బట్టి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. దాదాపు 5000 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ఈ జాబ్ మేళాను యువతి, యువకులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల వరకు తిరుమల గార్డెన్ కు చేరుకోవాలని, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలం గ్రామం నుండి పెద్ద ఎత్తున యువతీ, యువకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img