Homeసినిమాగత రాత్రి మెగా సిస్టర్స్ అంతా కలిసి చిల్.. ఫొటోలు వైరల్

గత రాత్రి మెగా సిస్టర్స్ అంతా కలిసి చిల్.. ఫొటోలు వైరల్

హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీన నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని ఇటీవలే నాగబాబు ప్రకటించారు.

దీంతో మెగా ఇంట సందడి మొదలైంది. నెల రోజుల ముందునుంచే ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే గత రాత్రి మెగా సిస్టర్స్ అంతా కలిసి చిల్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫోటోలను నిహారిక తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

మెగా డాటర్స్ అందరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతోంది.

నిహారిక పోస్ట్ చూసి ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్.

ఇకపోతే ఆమె పెళ్లి వేదికైన రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని కోటను అద్భుతంగా అలంకరిస్తున్నారని తెలిసింది.

నిహారికకు కాబోయే భర్త పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇతను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు.

ఇటీవలే కాబోయే భర్త చైన్యతో పెళ్లికి ముందే దీపావళి సంబరాలు చేసుకుంది నిహారిక.

ప్రస్తుతం నిహారిక పెళ్లి సంగతులు, నిహారిక- చైతన్య జోడీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

Recent

- Advertisment -spot_img