Homeఅంతర్జాతీయంఎన్నిక‌ల్లో ఓడిన ట్రంప్‌కు మెలానియా డైవ‌ర్స్!

ఎన్నిక‌ల్లో ఓడిన ట్రంప్‌కు మెలానియా డైవ‌ర్స్!

హైద‌రాబాద్ : అమెరికా ప్రెసిడెంట్‌ ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసిన‌ రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు ఫ్యామిలీ స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి.

ట్రంప్‌ భార్య మెలానియా.. డొనాల్డ్ ట్రంప్‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డిన‌ట్లు ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ చెప్పిన ట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడించింది.

15 సంవ‌త్స‌రాల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికేందుకు మెలానియా సిద్ధ‌ప‌డిన‌ట్లు న్యూమ్యాన్ చెప్పింది.

వైట్ హౌజ్‌లో వీరిద్ద‌రూ వేర్వేరు బెడ్ రూమ్‌లో ఉండేవార‌ని ట్రంప్‌ అనుచరుడు స్టీఫెన్‌ ఓల్కాఫ్ సైతం వెల్లడించిన‌ట్లు ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

త‌న ప్ర‌త్య‌ర్థి డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ విజ‌యం సాధించినా ఆ విష‌యాన్ని ట్రంప్ ఒప్పుకోవ‌డం లేదు.

డోనాల్డ్ ట్రంప్ స‌తీమ‌ణి మెలానియా ట్రంప్ సైతం ఓట‌మిని అంగీక‌రించాల‌ని చెబుతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రో వైపు త‌ప్పుడు ప‌ద్ధ‌తుల్లో బైడెన్ విజేత‌గా ప్ర‌క‌టించుకుంటున్నార‌ని అధ్య‌క్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు.

అమెరికా ప్రెసిడెండ్ ఎన్నిక‌ల్లో బైడెన్ 290, ట్రంప్ 214 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలుచుకున్న విష‌యం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img