- మెట్ పల్లి లో మహిళా హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ఇదే నిజం, కోరుట్ల : ప్రియుడి మోజులో పడి భర్తకు విడాకులిచ్చి..ఆ ప్రియుడి చేతిలోనే హత్యకు గురైన సంఘటనలో హంతకుడిని కేవలం 24 గంటల్లోనే మెట్ పల్లి పోలీసులు పట్టుకున్నారు. గురువారం నేరస్థుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
వివరాల్లోకి వెళితే..
ఈనెల 20న అర్ధరాత్రి మెట్ పల్లి పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సింగం మమత (38) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా.. గురువారం మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయంలో మెట్‌పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వర్ రావు హత్య కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఈనెల 20న సింగం మమత హత్య కేసులో నిందితుడు పట్టణంలోని సాయిరాం కాలనీకి చెందిన షేక్ అప్సర్ (29) ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడు షేక్ అప్సర్ హతురాలు సింగం మమతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని..అతని భార్యతో తరచూ గొడవలు జరిగేవని ఈ క్రమంలో ఈ నెల 20న అర్ధరాత్రి సింగం మమత ఇంట్లో మమతను షేక్ అప్సర్ కేబుల్ వైర్ తో ..చున్నీతో..గొంతుకు చుట్టి గొంతు నలిపి.. కడుపులో కత్తితో పొడిచి హత్య చేశాడని వెల్లడించారు. ఈ సమావేశంలో మెట్‌పల్లి సీఐ నవీన్, ఎస్సై చిరంజీవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.