Homeహైదరాబాద్latest Newsమైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. విమానాలు రద్దు.. అసలు ఎం జరిగిందంటే..?

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. విమానాలు రద్దు.. అసలు ఎం జరిగిందంటే..?

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం విమానాశ్రయాలపై కూడా పడింది. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలను రద్దు చేశారు. ఇప్పటికి మొత్తం 35 విమానాలు రద్దయ్యాయి. అయితే విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా యూజర్లకు బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ దర్శనమిస్తోంది. ల్యాప్‌ట్యాప్‌, పీసీ స్క్రీన్‌లపై ఈ ఎర్రర్‌ కనిపించి, ఆపై సిస్టమ్‌ షట్‌డౌన్‌ గానీ, రీస్టార్ట్ గానీ అవుతోందని సోషల్ మీడియాలో యూజర్లు పోస్టులు పెడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి అప్ లోడ్ చేస్తున్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు తమ టెక్నికల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్‌, సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ట్వీట్ చేసింది.

Recent

- Advertisment -spot_img