We generally think it is better to eat eggs, milk and chicken to stay healthy.
But today they do not know how much they are giving us health but they are still giving us sickness. They are the cause of terrible diseases in humans.
మనం ఆరోగ్యంగా ఉండేందుకు సాదారణంగా గుడ్లు, పాలు, చికెన్ తినడం మంచిది అనుకుంటాం. కానీ నేడు అవి మనకు ఆరోగ్యాన్ని ఎంత వరకు ఇస్తున్నాయో తెలియదు కానీ అనారోగ్యాన్ని మాత్రం ఇస్తూనే ఉన్నాయి. మనుషుల్లో భయంకరమైన రోగాలకు ఇవి కారణమవుతున్నాయి.
పాడి పశువుల పైనా, మనుషులపైనా దుష్ప్రభావం చూపే నిషేధిత హార్మోన్ ఇంజెక్షన్ల వినియోగం చాపకింద నీరులా విస్తరిస్తోంది.
ఆక్సిటోసిన్ హార్మోన్… మనుషుల శరీరాల్లోనే కాదు, పశువుల శరీరాల్లో కూడా సహజసిద్ధంగా ఈ హార్మోన్ ఉంటుంది.
స్త్రీకి కాన్పు సమయంలో అవసరమైనప్పుడు ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్ వేస్తారు. ఆక్సిటోసిన్ హార్మోను శరీర కండరాలపై ఒత్తిడి పెంచి కాన్పు సులువుగా కావడానికి దోహదపడుతుంది.
ఇదే సందర్భంలో ఈ హార్మోన్ ఇంజక్షన్ గేదెలకు సైతం వేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది.
సాధారణ పరిస్థితుల్లోనూ గేదెలకు, ఆవులకు సైతం ఈ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వేస్తున్నారు. కేవలం అధిక పాల ఉత్పత్తి కోసమే ఈ అనైతిక, అక్రమ వ్యవహారానికి కొందరు పాల్పడుతున్నారు.
ఆక్సిటోసిన్ కారణంగా గేదె శరీర కండరాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. సహజంగా జరిగే శరీర ప్రక్రియ పై ఈ హార్మోను గట్టిగా పనిచేస్తుంది.
సాధారణంగా ఐదు లీటర్ల పాలు ఇచ్చే గేదె ఈ హార్మోను ఇంజక్షన్ వల్ల శరీరం ఉత్తేజానికి గురై మరో రెండు, మూడు లీటర్ల పాలు అధికంగా ఇస్తుంది.
సాధారణంగా గేదె లేదా ఆవు తమ శరీరంలో ఉండే మొత్తం పాలను బయటకు ఇవ్వవు. పొదుగులో ఉండే మొత్తం పాలు పిండినప్పుడు సులువుగా వచ్చేస్తుంది.
అయితే వాటి శరీర కండరాల్లో, ఎముకల మూలన ఇంకా కొంత పాలు అలానే ఉంటాయి.
మామూలుగా అయితే పొదుగుకు చేరిన పాలు బయటకు వస్తాయి తప్ప శరీరంలో మిగతా చోట్ల నిల్వ ఉండే పాలు బయటకు రావు.
కానీ ఎప్పుడైతే వాటికి ఇంజక్షన్ ద్వారా కృత్రిమ ఆక్సిటోసిన్ శరీరంలోకి పంపుతామో అప్పుడు వాటి శరీరం అదనపు ఉత్తేజానికి గురై శరీరంలో మిగతా చోట్ల దాగి ఉన్న పాలు కూడా బలవంతంగా బయటకు వచ్చేస్తాయి.
ఇలా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడడం వల్ల పశువుల హార్మోన్‌లలో అసమతుల్యత ఏర్పడుతుంది. పదేళ్లు బతికే పశువు నాలుగైదేళ్లకే చనిపోయే ప్రమాదముంది.
ఇక కృత్రిమ హార్మోన్ ఇంజెక్షన్ వల్ల ఉత్పత్తి అయిన పాలు ఓ రకంగా విషంతో సమానమని వైద్యులు అంటున్నారు.
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల సాయంతో ఉత్పత్తి అయ్యే పాలు తాగిన వారిని క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఇక చిన్న పిల్లలకైతే మరింత త్వరగానే దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం ఉందంటున్నారు.
ఇక మనం తినే చికెన్…
కోడి బలిసేందుకు కోడి బరువు తక్కువ కాలంలో పెరగడానికి కోళ్లకు కూడా ఇంజక్షన్ వేస్తారని అందరికి తెలిసిందే.
అయితే ఇలా కోళ్లకు స్టెరాయిడ్స్‌ను ఇంజక్షన్ రూపంలో ఇవ్వటం వల్ల, చికెన్ తినే వారు అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశాలు ఎక్కువే.
వీటిని తినడం ద్వారా హార్మోన్ల విడుదలలో తేడా జరుగుతుంది, తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు.
ముఖ్యంగా మహిళల్లో స్టెరాయిడ్స్ ప్రభావం గర్భాశయ సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేడు మార్కెట్లలో లభిస్తున్న గుడ్లు ఎక్కువ శాతం హాప్లాయిడ్ ఎగ్స్. అంటే రెండు కోళ్లు (ఆడ, మగ) జత కట్టడం వల్ల తయారయ్యేవి కావు.
ఈస్ట్రోజెన్ హార్మోన్ తో గుడ్లు ఉత్పత్తయ్యేలా చేస్తున్నారు. సందేహం వస్తే వాటిని పొదిగించి చూడండి. లోపలి నుంచి పిల్లలు బయటకు రావు.
వచ్చాయంటే అవి సహజసిద్ధమైన కోడిగుడ్లేనని అర్థం.
ఈస్ట్రోజన్ తో తయారైన ఎగ్స్ తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిుల్లో యుక్త వయసు చాలా ముందుగానే రావడానికి ఇది కూడా ఒక కారణం.
10, 11 ఏళ్లకే వారు మెచ్యూర్ అవుతున్న ఘటనలను చూస్తున్నాం. గైనిక్ సమస్యలు పెరగడానికి కూడా ఇదొక కారణం.
పురుషుల్లోనూ బ్రెస్ట్ పెరిగిపోతుంది. ఓ సర్వే ప్రకారం దేశంలో జరుగుతున్న బ్రెస్ట్ రిమూవింగ్ సర్జరీలలో అధిక శాతం పురుషులు చేయించుకుంటున్నవేనట.
కారణం ఆహార పదార్థాల్లో గ్రోత్ హార్మోన్లను ఉపయోగించడమే.
ఇక దేశ వ్యాప్తంగా మారుతున్న ప్రజల జీవన విదానం, ఆహార ఉత్పత్తిలో పెరుగుతున్న వ్యాపార దురాలోచన భవిష్యత్ తరాల ఆరోగ్యాలను కూడా ప్రశ్నార్ధకంగా మారుస్తుంది.