Homeహైదరాబాద్latest Newsవడ్ల కొనుగోలు విషయంలో రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్న మిల్లర్లు

వడ్ల కొనుగోలు విషయంలో రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్న మిల్లర్లు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ఏఎంసీ మార్కెట్ యార్డ్ ను డిసిఓ సత్యనారాయణ సందర్శించి రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి చుట్టుపక్కల్లోని మిల్లులన్నీ పట్టని వడ్లని 42 కిలోలకు తీసుకోవడం జరుగుతుంది. ఇస్రాజ్ పల్లె గ్రామానికి చెందిన రైతు చిర్ర లింగయ్య 650 బస్తాలకు గాను పట్టని వడ్లు ఒక్కొక్క బస్తా బరువు 42 కిలోలు పెట్టి జోకి లారిలో మిల్లుకు పంపడం జరిగింది. అలా 42 కిలోలు పెట్టి మిల్లుకు పంపిన కూడా అదనంగా చిర్ర లింగయ్య అనే రైతు దగ్గర నుండి 4 బస్తాలు కట్టింగ్ చేయడం జరిగింది. ఇలా రైతుల దగ్గర్నుంచి అడ్డగోలు వసూలు చేస్తున్న మిల్లులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

Recent

- Advertisment -spot_img