Homeతెలంగాణ#CM #Harish_Rao : సీఎం టూర్​ ఏర్పాట్ల పనుల్లో మంత్రి హరీష్​ రావు..

#CM #Harish_Rao : సీఎం టూర్​ ఏర్పాట్ల పనుల్లో మంత్రి హరీష్​ రావు..

Chief Minister KCR will visit Siddipet district on the 10th of this month. During this occasion, foundation stone laying and inauguration ceremonies will be held for various development works. Minister Harish Rao is in charge of arranging the CM tour.

ఈ నెల 10వ తేదీన సిద్ధిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో ప్రభుత్వం పేదలకోసం రూ.163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని, సిద్దిపేటలో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రారంభించనున్నారు.

మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

పట్టణంలోని చింతల్‌చెరువు వద్ద రూ.278 కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించనున్నారు.

రంగనాయకసాగర్‌ జలాశయం మధ్య రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని, మిట్టపల్లి రైతువేదికను, విపంచి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించి, కోమటిచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాకేంద్రానికి శివారులో నిర్మించిన ఐటీ టవర్‌- ఇండస్ట్రియల్‌ పార్క్‌ శంకుస్థాపన పనులను పర్యవేక్షించారు.

అనంతరం సిద్ధిపేట-పొన్నాలలో తెలంగాణ భవన్‌ సిద్ధిపేట జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img