Homeఫ్లాష్ ఫ్లాష్#KTR: హైదరాబాద్ ఏ పార్టీది కాదు.. కేటీఆర్‌

#KTR: హైదరాబాద్ ఏ పార్టీది కాదు.. కేటీఆర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి చెందదని ఈ విశ్వ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భారత దేశంలోనే హైదరాబద్ అత్యంత అరుదైన, చారిత్రాత్మక నగరమని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం హెచ్‌ఐసీసీలో నిర్వహించిన బ్రాండ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ హైదరాబాద్ ఆకర్షిస్తోందన్నారు.

2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు పెరిగాయని, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ హైదరబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు.

పెట్టుబడుదారులకు హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ నగర శాంతిభద్రతలు ఎంతో మెరుగుపడ్డాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని అత్యున్నతస్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img