Homeహైదరాబాద్latest Newsఎంఐటీ స్టూడెంట్స్..12 సెకన్లలోనే పని ముగించేశారు

ఎంఐటీ స్టూడెంట్స్..12 సెకన్లలోనే పని ముగించేశారు

మసాచుసెట్స్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో టాప్ 10 లో ఉంటుంది. అటువంటి యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకడమే గగనం. ఎంతో ప్రతిభాసామర్థ్యాలు ఉన్న విద్యార్థులకు అక్కడ సీటు లభిస్తుంది. వల్డ్ క్లాస్ లీడర్లు అక్కడినుంచి ఏటా పుట్టుకొస్తారు. ప్రపంచాన్ని శాసించేంత ఎత్తుకు ఎదుగుతారు. అంతటి చరిత్ర ఉన్న యూనివర్సిటీలో చదివే ఇద్దరు విద్యార్థులు పక్కదారి పట్టారు. ఈజీమనీ కోసం అడ్డదారులు తొక్కారు. చివరకు కటకటాల పాలయ్యారు.

వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన ఆంటోన్ బ్యూనో ,జేమ్స్‌ బ్యూనో MIT యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నారు. అధునాతన సాంకేతికతలో నైపుణ్యం ఉన్న వీరు ఈజీ మనీ కోసం మోసానికి పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో క్రిప్టో టెక్నాలజీలో పెండింగ్‌ లావాదేవీలను మోసపూరితంగా యాక్సెస్‌ చేసి వాటిని మార్చారు.

కేవలం 12 సెకన్లలోనే 25 మిలియన్‌ డాలర్ల విలువైన ఇథేరియం క్రిప్టోలను వారు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. ట్రేడర్లు తమ ఖాతాల్లోకి క్రిప్టో లావాదేవీలు (Crypto Transactions) జమచేస్తున్నా కాకపోవడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘరానా మోసం బయటపడింది. దర్యాప్తు చేపట్టిన ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు నిందితులను గుర్తించి తాజాగా పట్టుకున్నారు. బోస్టన్‌లో ఆంటోన్‌ను, న్యూయార్క్‌లో జేమ్స్‌ను అరెస్టు చేశారు.

నిందితులు ఐదు నెలల పాటు ఇందుకు ప్లాన్‌ చేసి సెకన్లలో అమలుచేశారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన ఈ అన్నదమ్ములు.. ఆ క్రిప్టోలను తిరిగిచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. వాటిని ఎక్కడ దాచిపెట్టారన్న విషయాన్ని కూడా వెల్లడించట్లేదట. ఈ కేసులో నేరం రుజువైతే వీరిద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img