HomeజాతీయంSupreme Court ఆవరణలో ‘మిట్టీ కెఫే’

Supreme Court ఆవరణలో ‘మిట్టీ కెఫే’

– ప్రారంభించిన సీజేఐ డీవై చంద్రచూడ్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మానసిక, శారీరక వైకల్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా సుప్రీంకోర్టు ప్రత్యేక చొరవ చూపింది. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రాంగణంలో దివ్యాంగులతో నడిచే కెఫే ఏర్పాటైంది. ఈ ‘మిట్టీ కెఫే’ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ఇతర జడ్జిలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. ‘ఈ కెఫేను నడిపేవారంతా ప్రత్యేక అవసరాలున్నవారే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ‘మిట్టీ కెఫే’ 38 కేఫ్‌టేరియాలను నిర్వహిస్తోంది. కరోనా టైమ్​లో వీరు 60 లక్షల భోజనాలను అందించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కెఫే ప్రారంభమవడం ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక వెంచర్‌కు బార్‌ సభ్యులంతా మద్దతుగా ఉంటారని ఆశిస్తున్నా’అని తెలిపారు.
ఇక, రోజంతా కేసుల వాదనలతో బిజి బిజీగా గడిపే సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌.. ఇటీవల సుప్రీంకోర్టు పరిసరాల్లో కలియతిరిగిన విషయం తెలిసిందే. సహచర న్యాయమూర్తులతో కలిసి కేఫ్‌టేరియాకు వెళ్లిన ఆయన.. అక్కడ టీ తాగి , సమోసా తిన్నారు. సీజేఐ సింప్లిసిటీ చూసి సహచర జడ్జిలు, లాయర్లు, కోర్టు సిబ్బంది ఆశ్చర్యపోయారు.

Recent

- Advertisment -spot_img