Homeహైదరాబాద్latest Newsబొడ్రాయి వార్షికోత్సవ వేడుకల్లో MLA దంపతులు

బొడ్రాయి వార్షికోత్సవ వేడుకల్లో MLA దంపతులు

ఇదేనిజం, మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: మహబూబాద్ జిల్లా కేంద్రంలో గత సంవత్సరం గ్రామ దేవత ( బొడ్రాయి )ని గ్రామ దేవత కార్యనిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో పునప్రతిష్ఠించారు. అందుకుగాను ఈనెల 24, 25 తేదీలలో బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజైన శనివారం స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఉమా దంపతుల చేతుల మీదుగా వేద పండితులు విగ్నేశ్వర పూజ జలాభిషేకం జరిపించారు. ఈ వేడుకలలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి, గణపురపు అంజయ్య, స్థానిక కౌన్సిలర్, కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img