Homeహైదరాబాద్latest Newsఅల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..

అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..

మల్కాజిగిరి: జూన్ 20 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నేరేడ్మెట్ డివిజన్ పరిధి సప్తగిరి కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతు …చేతి, కాలివేళ్ల గోళ్లను చిన్నవిగా కత్తిరించుకోవడంతో పాటు శుభ్రంగా ఉంచుకోవాలి అన్నరు.పరిశుభ్రమైన నీళ్లను తాగాలి అని, పరిసరాల శుభ్రత పాటించాలి అని తెలియాజేశారు.రోజు వారీగా ఇంట్లో తీసుకునే ఆహారంపై ఎప్పుడూ మూతలు ఉంచలి అని వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం ఎంతో అవసరం తెలిపాడు.భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.ప్రతి ఒక్కరూ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నదని వివరించారు.పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా నిరోధించాలని ఎమ్మెల్యే కోరారు.

Recent

- Advertisment -spot_img